ప్రపంచ కప్ భవిష్య-ప్రవక్తలు

Translated into Telugu (Original version)


మీకు పాల్, ఆక్టోపస్ గుర్తు లేదా? జర్మనీలొని ౨౦౧౦ ప్రపంచ కప్ ఆటల పోటీలలో విజేతను ఊహించగలిగినందువలన అది ప్రసిద్ధ వ్యక్తియైనది. అది కూడా ఫైనల్ విజేతను ఊహించెను. అతని కెరీర్ యూరో 2008 నుండి మొదలైనది మరియు 13 ఆటలపోటీలలో 11 ను ముందే సరిగ్గా చెప్పుటవరకు కొనసాగినది. అ ది ప్రతి మ్యాచ్లో పాల్గొన్న ప్రతి జట్టు యొక్క  జాతీయ జెండాలతో కూడిన  రెండు ఆహార బాక్సుల మధ్య ఎంచుకునే ది. దురదృష్టవశాత్తు, అది 2010 చివరలో మరణించినది.

పాల్ ఒక్కటే కాదు.  హ్యారీ మొసలి కూడా 2010 ప్రపంచ కప్ విజేతను   ఊహించినది. అంతేకాకుండా వరుసగా రెండు ఆస్ట్రేలియన్ ఫెడరల్ ఎన్నికల ఫలితాలు అంచనా వేయగలిగినది. అయితే,దానికి  జర్మన్ ఆక్టోపస్ అంత ఆకర్షణ  ఎప్పుడూ ఉండేది కాదు. మణి కూడా అంతకంటే బాగుగా చేయలేకపోయినది. అది ఒక సింగపూర్ చిలుక.ఎందుకంటే, అది 2010 ప్రపంచ కప్ లోని  అన్ని క్వార్టర్ ఫైనల్స్ మరియు  సెమీ-ఫైనల్స్ ను ఊహించినప్పటికీ   ఫైనల్లో స్పెయిన్ మరియు నెదర్లాండ్స్ మధ్య విజయం ఎవరిని  వరిస్తుందో అంచనా వేయుటలో విఫలమైంది.

పాల్ యొక్క అకాల నిష్క్రమణ (మరణము)  నుండి దాని కిరీటంఎవరు తీసుకుంటారు అనేదానిమీద గొప్ప పోటీ ఉంది. యూరో 2012 సమయంలో, ఈ మూడు జంతువులు ఈ ఆటను ఆడుతుండినవి. చిత్త, ఒక భారతీయ ఏనుగు,  పోలండ్ దేశం లోని , క్రకౌ లోని ఒక జూ లో నివసించుచున్నది. ఫ్రెడ్, ట్విట్టర్ లో అనుసరించదగిన  ఉక్రేనియన్ ఫెర్రేట్. మరియు ఫంటిక్, ఉక్రేనియన్ సోది చెప్పు అడవిపంది, సరిగ్గా 2 3 మ్యాచ్   ల లో ఉక్రేనియన్ భవిష్యత్తును గూర్చిఅంచనా సరిగ్గా బాగుగా వేయగలిగినది.

తరువాతి ప్రపంచ కప్ లో పాల్ అనబడు ఆక్టోపస్ యొక్క స్థానమును ఎవరు తీసుకొనెదరు? ప్రస్తుతం ఇటలీ దేశపు జాతీయ ప్రజా ప్రసారకములో ప్రసిద్ధ వ్యక్తిగానున్న, సెయ్ంట్ పీటర్ స్క్వేర్లో పోప్ ఫ్రాన్సిస్ చేత దీవించబడిన, చిలుక అవుతుందా? లేదా నెల్లీ,  33 మ్యాచ్ ఫలితాలు లో  30 సరిగ్గా అంచనా వేసిన జర్మన్ ఏనుగు అవుతుందా? మరియు  రాష్ట్ర మీడియా మద్దతు పొందిన పాండా పిల్ల మానసిక శక్తులను తక్కువ అంచనా వేయవద్దు.

 అమోర్ (ప్రేమ, ఇటాలియన్) అనే ఇటాలియన్ చిలుక ఒక సూక్ష్మ ఫుట్బాల్ మైదానంలో విజేత జట్టు జెండా ఎంచుకోవడం ద్వారా తన అంచనా ఇస్తుంది. నెల్లీ ముందు పోటీ దేశాల జెండాలతో ఉన్న వలలను ఉంచుతారు.పోటీ దేశాల జెండాలతో ఉన్న వాటిలో ఎదో ఒక వలలో  బంతిని తన్నడం ద్వారా విజేతలను అంచనా వేయడానికి అది ఇష్టపడుతుంది. బదులుగా, పాండా పిల్ల గ్రూప్ మ్యాచ్ సమయంలో జెండాలతో గుర్తింపబడిన బాక్సుల నుండి ఆహార ఎంచుకోవడం ద్వారా మరియు నాకౌట్ రౌండ్లలో ఒక జండా ఎగురుతున్న చెట్టు  ఎక్కటం ద్వారా మ్యాచ్ ఫలితం అంచనా వేస్తుంది.

మీకు ఒక పెంపుడు జంతువుఉందా?
(అతను లేదా ఆమె)  అది బాగా చేసిఉండేదా? ఎలా?
వాళ్ళను ఒక షాట్ కొట్టనివ్వండి!

by Cvs Rao

10 Votes
#343 of #1440 in the World
#2 of #3 for Telugu


Cvs Rao's website

Go to the ranking page for Telugu

Can you translate better?

Join the challenge