ప్రపంచ కప్ భవిష్యవాణులు

Translated into Telugu (Original version)


మీకు పౌల్, అదే ఆక్టోపస్ గుర్తున్నదా? అతను 2010 ప్రపంచ కప్ యొక్క స్టార్, జర్మనీల యొక్క విజేతను ఊహించడంలో సమర్థుడైనాడు. అతను ఫైనల్ యొక్క విజేతను కూడా ఊహించాడు. అతని కెరీర్ యూరో 2008 నుండి మొదలైనది మరియు 13 మ్యాచులలో 11 ను ముందే సరిగ్గా చెప్తూ ఉండటం మనం చూశాం. ప్రతి మ్యాచులో పాల్గొన్న ప్రతి బృందం యొక్క జాతీయ జెండాలతో ఆహారమును కలిగి ఉన్న రెండు డబ్బాలలో ఒక దానిని అతను ఎంచుకునేవాడు. దురదృష్టవశాత్తు, అతను 2010 చివరలో మరణించాడు.

పౌల్ ఒంటరివాడు కాదు. హ్యారీ అనే మొసలి కూడా 2010 ప్రపంచ కప్ విజేతను ఊహించాడు. అంతేకాకుండా, అతను వరుసగా రెండు ఆస్ట్రేలియన్ ఫెడరల్ ఎన్నికల ఫలితాలను ముందుగా ఊహించగలిగాడు. అయినప్పటికిని, అతనికి జర్మన్ ఆక్టోపస్ అంత ఆకర్షణ ఎప్పుడూ ఉండేదికాదు. మణి కూడా అంతకంటే బాగుగా చేయలేకపోయాడు, అతను ఒక సింగపూర్ చిలుక 2010 ప్రపంచ కప్ యొక్క అన్ని క్వార్టర్స్ మరియు సెమీ-ఫైనల్స్ ఊహించినప్పటికి,  ఫైనల్ లో స్పెయిన్ మరియు నెదర్లాండ్స్ మధ్య ఎవరు విజయం సాధించగలరు అనే దానిని ఊహించడంలో అతను విఫలమైనాడు.

పౌల్ యొక్క అకాల నిష్క్రమణ నుండి, అతని కిరీటం ఎవరు సాధించగలరు అనే దానిపై గొప్ప పోటీ ఉండినది. యూరో 2012 సమయంలో, ఈ ఆటను మూడు జంతువులు ఆడుతూ ఉండినవి. చిత్త, ఒక భారతీయ ఏనుగు,  పోలెండ్ దేశంలోని క్రకౌలోని ఒక జంతుప్రదర్శనశాలలో నివశించుచుండినది. ఫ్రెడ్, ట్విట్టరుపై అనుసరించదగిన  ఉక్రేనియన్ ఫెర్రెట్. మరియు ఫుంటిక్, సోది చెప్పే ఉక్రేనియన్ పంది 3 మ్యాచులలో 2 టిని సరిగ్గా ఊహించగలిగింది.

తదుపరి ప్రపంచ కప్ సమయంలో పౌల్ అనబడు ఆక్టోపస్ యొక్క స్థానమును ఎవరు సాధిస్తారు? ప్రస్తుతం ఇటలీ దేశపు జాతీయ ప్రజా ప్రసారకములో ప్రసిద్ధ వ్యక్తిగానున్న, సెయింట్ పీటర్స్ స్క్వేర్లో పోప్ ఫ్రాన్సిస్ చేత దీవించబడిన, చిలుక అవుతుందా? లేదా,  నేటివరకు 33 మ్యాచ్ ఫలితాలలో 30 సరిగ్గా ముందుగా ఊహించిన జర్మన్ ఏనుగు నెల్లీ అవుతుందా? మరియు బహుశా, చైనీస్ రాష్ట్ర మీడియా మద్దతు పొందిన పాండా పిల్ల యొక్క మానసిక శక్తులను తక్కువ అంచనా వేయవద్దు.

అమోర్ (ఇటాలియన్ భాషలో ప్రేమ అని అర్థం) అనబడే ఇటాలియన్ చిలుక ఒక సూక్ష్మ ఫుట్బాల్ మైదానంపై విజేత జట్టు జెండా ఎంచుకోవడం ద్వారా తన అంచనా ఇస్తుంది. నెల్లీ ముందు పోటీ పడే దేశాల జెండాలతో ఉన్న వలలలో ఎదో ఒక వలలో బంతిని తన్నడం ద్వారా విజేతలను ముందుగా ఊహించడానికి అది ఇష్టపడుతుంది. బదులుగా, పాండా పిల్ల గ్రూప్ మ్యాచుల సమయంలో జెండాలతో గుర్తింపబడిన డబ్బాల నుండి ఆహారం ఎంచుకోవడం ద్వారా మరియు నాకౌట్ రౌండ్లలో ఒక జండా ఎగురుతున్న చెట్టు ఎక్కటం ద్వారా మ్యాచ్ ఫలితాలను ముందుగా ఊహిస్తుంది.

మీకు ఒక పెంపుడు జంతువు ఉందా?
అది బాగా చేయగలిగి ఉండేదా? ఎలా?
వాటిని ఒక షాట్ ఇవ్వనిద్దాం!

by I.SATISH KRISHNA

52 Votes
#122 of #1440 in the World
#1 of #3 for Telugu


I.SATISH KRISHNA's website

Go to the ranking page for Telugu

Can you translate better?

Join the challenge